వైరల్ : కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఏరియల్ సర్వే ఫోటోలు 


కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జలాశయాన్ని ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కొండ పోచమ్మ ప్రాజెక్టు సంబంధించిన ఏరియల్ సర్వేల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి కేటీఆర్ వీటిని ట్విట్టర్ లో షేర్ చేశారు. వీటితో పాటు తెలంగాణలో కొండంత సంబరం అంటూ..  కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఫోటోలు, దాని ప్రత్యేకతలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ఎత్తయిన ప్రాంతం ఇదే. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. మేడిగడ్డ నుంచి వచ్చే జలాలు దాదాపు అర కిలోమీటరు (518 మీటర్లు) మేర పైకి వచ్చి కొండపోచమ్మ జలాశయంలోకి చేరనున్నాయి. ఈ జలాశయం ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది.