పవన్-కేసీఆర్ భేటీలో మతలబు ఇదేనా.. ?
సోమవారం సాయంత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిద్దరి కలయికలో అసలు మతలబు ఏంటి అనేదానిపై తెలుగురాష్ట్రల్లో ఆసక్తి నెలకొంది. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే వచ్చానని, తెలుగు మహాసభలకు హాజరు కాలేకపోవడం వల్లే కలిసి వెళ్లడానికి వచ్చానని పవన్ చెప్పినా అసలు విషయం అది కాదనేది అందరి నోటా వినిపిస్తున్న మాట.
తెలంగాణ ప్రభుత్వ పనితీరును, సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తడం, సీఎం రాకకోసం గంటకు పైగా ఎదురుచూడటం చూస్తోంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు చేసిన విధంగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ ఆ స్ట్రాటజీని కేసీఆర్ ప్రయోగిస్తారనే సమాచారం అందుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చడానికి టీఆర్ఎస్ కొత్త ఎత్తుగడ వేస్తోందని చెబుతున్నారు. అరగంటపాటు పవన్, కేసీఆర్ భేటీ సారాంశం వెనక కూడా అసలు మతలబు ఇదేనంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో, ఆ స్ట్రాటజీ ఏమేరకు పనిచేస్తుందో చూడాలి మరి…!