కొండపోచమ్మని తాకిన గోదావరి జలాలు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయ్. గోదావరి జలాలని తెలంగాణ బీడు భూములని తడుపుతానని మాటిచ్చిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మర్కూక్ పంప్ హౌస్ ను ప్రారంభించారు.

పంప్ హౌస్ స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జిలాలల కొండపోచమ్మ సాగర్ లోకి చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ఇద్రకరణ్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ఎత్తయిన ప్రాంతం ఇదే. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. మేడిగడ్డ నుంచి వచ్చే జలాలు దాదాపు అర కిలోమీటరు (518 మీటర్లు) మేర పైకి వచ్చి కొండపోచమ్మ జలాశయంలోకి చేరాయి. ఈ జలాశయం ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. ఇప్పటి వరకు 12 కాళేశ్వరం పంప్ హౌస్లు మొదలయ్యాయ్. నీటి అరకీలోమీటరు ఎత్తుకొచ్చి.. కొండపోచమ్మ సాగర్ ని చేరుతున్నాయ్.