హైకోర్టులో జగన్’కు షాక్.. ఎస్ఈసీగా మళ్లీ రమేష్  కుమార్ !

ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ తగిలింది. ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను ఏపీ ప్రభుత్వం కొట్టివేసింది. రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ పదవిలోకి వచ్చా.  స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయని రమేశ్ కుమార్ అన్నారు. పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు.