నిమ్మగడ్డ రీ-ఎంట్రీపై పవన్ కామెంట్ 

ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్ట్ కొట్టివేసింది. రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తాజా కోర్టు తీరుపై తెదేపా, భాజాపా, జనసేన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రమేష్ కుమార్ రీ నియామకంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది, అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది” అని పవన్ రాసుకొచ్చారు.