లాక్డౌన్ 5.0లో పర్యటక, ఆతిథ్య రంగాలకు ఉపశమనం ?
కరోనా కట్టడి కోసం దేశంలో విడతలవారీగా లాక్డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రేపటితో (మే 31) నాల్గో విడత లాక్డౌన్ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐదో విడత లాక్డౌన్ కోసం కేంద్రం కసరత్తులు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఐదో లాక్డౌన్ గైడ్ లైన్స్ ని రెడీ చేస్తోంది.
కరోనాతో కలిసి బతకాల్సిందేనని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఇప్పట్లో కరోనా కంట్రోల్ లోకి రావడం కష్టమే. దానితో సహజీవనం తప్పదని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కరాత్రి పూట కర్ఫ్యూ తప్ప.. మిగితా అన్నింటికి క్రమక్రమంగా సడలింపులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఐదో విడత లాక్డౌన్ లో పర్యటక, ఆతిథ్య రంగాలకి సడలింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో హోటల్స్, డైన్-ఇన్ రెస్టారెంట్లు, బీచ్‌లు తెరచుకోనున్నాయి.
పుదుచ్చేరి, కేరళ, గోవా, కొన్ని ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా పర్యాటకం, ఆతిథ్య రంగంపై ఆధారపడి ఉన్నాయి. ఐదో విడత లాక్డౌన్ లో ఈ రాష్ట్రాలకి ఉపశమనం కలగనుంది. 50 శాతం సామర్థ్యం, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలతో టూరిజం, ఆతిథ్య రంగాలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు పర్యాటక రాష్ట్రాలు కోరాయి. దానికి కేంద్రం కూడా ఓకే చెప్పినట్టు సమాచారమ్.