జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం
కరోనా మహమ్మారి దేవుళ్లని వదిలిపెట్టలేదు. కరోనా ఎఫెక్ట్ తో దేశంలోనే దేవాలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఐదో విడత లాక్డౌన్ లో భాగంగా ఆలయాలు తెరచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 8 నుంచి భక్తులకి శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది.
ఇందుకోసం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. గంటకు 500 మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నారు. రోజుకు 7 వేల మంది భక్తులకు దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లను టైంస్లాట్ విధానంలో కేటాయించనున్నారు. దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. వసతి గదుల కేటాయింపు కూడా ఆన్లైన్లోనే జరగనుంది. మొదటి 3 రోజులు టీటీడీ ఉద్యోగులు, సిబ్బందికి అనుమతిచ్చే అవకాశం ఉంది. తర్వాత 15 రోజులు తిరుపతి, తిరుమల వాసులకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత చిత్తూరు వాసులకు అనుమతిచ్చే అవకాశం ఉంది.