తెలంగాణలో లాక్ డౌన్ 5.O గైడ్ లైన్స్.. ఇవే !
ఐదో విడత లాక్ డౌన్ ని కేంద్రం జూన్ 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ లకి మాత్రమే లాక్ డౌన్ ని పరిమితం చేసింది. రాత్రి కర్ఫ్యుని మాత్రం యధాతథంగా ఉంచుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐదో విడత లాక్ డౌన్ సడలింపులపై చర్చించారు.
అంతర్ రాష్ట్ర సర్వీసులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపింది. అయితే ఆర్టీసీ, ప్రయివేటు బస్సులకి మాత్రం అనుమతిని ఇవ్వలేదు. హోటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, దేవాలయాలు తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వలేదు.
ఐదో విడత గైడ్ లైన్స్ :
* ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం ఎత్తివేత. ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదు
* రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుంది
* వాణిజ్య సముదాయాలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలి. ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు కొనసాగుతాయి