బ్రేకింగ్ : యాంకర్ ప్రదీప్’కు జైలు శిక్ష

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ యాంకర్ ప్రదీప్’కు జైలు శిక్ష పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు ప్రదీప్ కోర్టు ముందు హాజరుకానున్నాడు. ప్రదీప్ తీసుకొన్న ఆల్కాహాల్ రేటింగ్’ని బట్టి ఆయనకు రెండు నుంచి ఏడు రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఒకవేళ సెలబ్రేటీ అని శిక్ష వేయకుండా వదిలేస్తారా ? అనుకొంటే.. అప్పుడు సామాన్యుడు, సెలబ్రేటీకి వేరే వేరే శిక్షలా ? అనే సమస్యలు తలెత్తనున్నాయి. ఇక, ఇదీగాక ఇటీవలే ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో నీతులు చెప్పాడు. ఆల్కాహాల్ సేవించి వాహనాలు నడపరాదని ఆ వీడియోలో తెలిపాడు ప్రదీ. ఇప్పుడా వీడియోని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నీతులు చెప్పిన ప్రదీప్.. ఇలా అడ్డంగా బుక్కయ్యాడని చెప్పుకొంటున్నారు.