బాబోయ్.. ప్రగతి ఆంటీ ఓ రేంజ్ లో !

నటి ప్రగతి అభిమానులని మరోసారి సప్రైజ్ చేసింది. వర్కౌట్ వీడియోని షేర్ చేసింది. ఇందులో ప్రగతి ఆంటీ తిప్పుడు, ఊపుడుకు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. 44 యేళ్ల ప్రగతి సోషల్ మీడియాలో దుమ్మురేపుతుండటం విశేషం. ఆమె నుంచి తరచు వీడియోలొస్తున్నాయ్. వైరల్ అవుతున్నాయ్. ఆ మధ్య లుంగీ కట్టి డ్యాన్స్ చేసిన ప్రగతి ఆంటీ.. తాజాగా జిమ్ వీడియోతో అదరగొడుతోంది.

చీరకట్టుతో తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లోనే కనిపించిన ప్రగతి.. ఇలా డ్యాన్సులతో రెచ్చిపోవడం అభిమానులకి కొత్తగా అనిపిస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళంలో వందకు పైగా సినిమాలు చేసింది ప్రగతి. అమ్మలి, తల్లి, అక్క పాత్రలతో ఆకట్టుకుంది. స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ప్రగతి ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టినట్టుంది. దానికి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

View this post on Instagram

Not a bad try 😈

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on