నయన్-విఘ్నేష్ పెళ్లి ఫిక్స్
స్టార్ హీరోయిన్ నయనతార త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారమ్. ఆమె చాన్నాళ్ల నుంచి యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి తరచు విదేశీ టూర్లకి వెళ్లడం. అక్కడ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయడం అలవాటుగా పెట్టుకొన్నారు. వాటికి సంబంధించిన కొన్ని అపురూపమైన ఫోటోలు, వీడియోలు అభిమానులకి కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే వీరి పెళ్లి ముచ్చట వచ్చే సరికి.. రకరకాల ప్రచారం జరిగేది.
ఇప్పుడీ ఈ ప్రచారానికి పులిస్టాప్ పెడుతూ నయన్-విఘ్నేష్ జంట పెళ్లితో ఒక్కటి కాబోతున్నట్టు సమాచారమ్. ఇన్నాళ్లు పెళ్లికి విఘ్నేష్ నుంచి రెస్పాన్స్ కరువైనట్టు వార్తలు వినిపించాయ్. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే… ? పెళ్లి విషయంపై విఘ్నేష్ ఫ్యామిలీనే నయన్ పై ఒత్తిడి తీసుకొచ్చిందట. వారి మాటని కాదనలేక నయన్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారమ్. అతి త్వరలోనే నయన్-విఘ్నేష్ ల పెళ్లి జరగనుందని తెలుస్తోంది.