తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు

జూన్ 2 – తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు సీఎం కేసీఆర్. అభివృద్దిలో దేశంలోనే నెం. 1 స్థానంలో మన తెలంగాణ ఉంది. ఇక ఈరోజు తెలంగాణ ఆవిర్భవదినోత్సవం సందర్భంగా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం.” అంటూ రాష్ట్రపతి ట్విట్ చేశారు.