వాక్సిన్ వచ్చే వరకు స్కూల్స్ క్లోజ్

మహమ్మారి కరోనా ఇప్పట్లో కంట్రోల్ అయ్యేలా కనిపించడం లేదు. ఇకపై కరోనాతో కలిసి బతక తప్పదని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. భారత్ కూడా అదే భావిస్తోంది. ఈ నేపథ్యంలో విడతల వారీగా లాక్ డౌన్ పొడగిస్తూ.. భారీగా సడలింపులు
ఇస్తున్నారు. క్రమక్రమంగా అన్నింటిని తెరుస్తున్నారు.

జులైలో స్కూల్స్ కూడా తెరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయ్. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకి వాక్సిన్ వచ్చే వరకు స్కూల్స్ తెరవొద్దని విజ్ఝప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఒక పిటిషన్‌పై 2.13లక్షల మంది తల్లిదండ్రులు సంతకాలు చేసి కేంద్రానికి పంపించారు. జూలైలో విద్యా సంస్థలు తెరిస్తే పరిస్థితి దారుణమవుతుందని తల్లిదండ్రులు ఆ పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.