బాబోయ్ న్యూఇయ‌ర్ డ్రంక్ అండ్ డ్రైవ‌ర్స్ ఇంత‌మందా..?

న్యూఇయ‌ర్ సంద‌ర్బంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలామంది మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మొత్తం 2400మంది ప‌ట్టుబ‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. వారంద‌రికీ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంట‌ర్ల‌లో కౌన్సిలింగ్ కొన‌సాగుతోంది.

తల్లిదండ్రులు, రక్త సబంధికులు ఉంటేనే కౌన్సెలింగ్ కు అనుమతిస్తున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష విధించిడం అనేది మేజిస్ట్రేట్ మీద ఆధార పడి ఉంటుంది. ఈరోజు నుంచి శ‌నివారం వ‌ర‌కు ఈ కౌన్సిలింగ్ జ‌రుగుతుంది. ఆలోగా ప‌ట్టుబ‌డ్డ‌వారు కౌన్సిలింగ్ కు హాజ‌రు కావ‌చ్చు. ట్రాఫిక్ పోలీసులు విధించిన సమయంలో పు కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.