ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

కరోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ ముందుంది. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8,066 మంది నమూనాలు పరీక్షించగా 180 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,971 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 68కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,244కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 967 మంది చికిత్స పొందుతున్నారు.