ఒక్కో వలస కార్మికుడికి 10వేలు

కరోనా లాక్‌డౌన్‌తో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్దారు. ఉన్నచోట ఉండలేక, తిండిలేక, సొంత ఊళ్లకి వెళ్లక.. వారి బాధలు వర్ణణారహితం. దాదాపు రెండునెలల తర్వాత వలస కార్మికులు సొంత ఊర్లకి వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సవాలక్ష కండీషన్స్ పెట్టింది. సొంతూళ్లకు వెళ్లేందులు సరైన సౌకర్యాలని కల్పించలేదు. ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించినా..  ఖర్చులు వలస కార్మికులే భరించాలనే నిబంధనలు పెట్టింది.

ఫైనల్ గా కిందా మీదా పడుతూ వలస కార్మికుడు సొంతూరికి చేరుకున్నాడు. అయితే ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తక్షణం ఆదుకోవాలంటే కేంద్రం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు చొప్పున జమ చేయాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం దీదీ ట్విట్ చేశారు.

“ప్రస్తుతం కరోనా సంక్షోభంతో సాధారణ ప్రజల జీవితాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలు మెరుగవ్వాలంటే తక్షణమే కేంద్రం వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు చొప్పున జమ చేయాల్సిందిగా కోరుతున్నా. ‘పీఎమ్‌ కేర్స్‌’ నిధికి వచ్చిన విరాళాల్ని ఇందుకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది” అంటూ రాసుకొచ్చారు.