ఊపిరి పీల్చుకున్న ముంబయి

దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పెను ప్రమాదం తప్పింది. అసలే కరోనా మహమ్మారి ముంబై మహానగరాన్ని గజగజ వణికిస్తోంది. ఇలాంటి టైంలో ముంబైకి నిసర్గ తుపాను రూపంలో మరో పెను ప్రమాదం పొంచివచ్చింది. అయితే, బుధవారం సాయంత్రానికే నిసర్గ బలహీన పడింది. దీంతో ముంబయి నగరం తుపాను నుంచి బయటపడింది.

మరోవైపు నిసర్గ తుపాను వల్ల రాయ్‌గడ్‌ జిల్లాలో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్లు రాయగడ్‌ జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి వెల్లడించారు. అలీబాగ్‌ ప్రాంతంలో విద్యుత్‌ స్తంభం కూలి ఓ వృద్ధుడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. నిసర్గ ముప్పు గుజరాత్‌కు కూడా తప్పింది.