వైసీపీకి మరోసారి రంగుపడింది !

గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొందింది. వైఎస్ జగన్ సీఎం అయ్యారు. పాలనలోనూ దూకుడు చూపించారు. దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకోవాలనే కసి జగన్  లో కనిపించింది. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులేశారు. అంతా ఫ్యాన్ మయం అనే కలరింగ్ ఇచ్చారు. అక్కడే తేడా వచ్చింది.

వైసీపీ రంగులపై తెదేపా కోర్టుకెళ్లింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులేంటని ఏపీ హైకోర్టు చురకలంటించింది. దీంతో వైసీపీ పార్టీ రంగులకి మరో రంగుని యాడ్ చేశారు. దీంతో అది వైసీపీ జెండా రంగులు కాదు. మిక్సిడ్ అనికటింగ్ ఇచ్చింది. దీనిపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన సుప్రీం.. వైసీపీకి షాక్ ఇచ్చింది. ఆ రంగులని చెరిపేయాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు కాపీ అందాకే నిర్ణయం తీసుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు.