ఆ హీరోయిన్ పై ఆశపడ్డ గోపీచంద్

యాక్షన్ హీరో గోపీచంద్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవికి ఫిదా అయిపోయాడు. తన తదుపరి సినిమాలో ఆమెతో రొమాన్స్ చేయాలని ఆశపడ్డారు. తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘అలిమేలు (సమేత) వెంకటరమణ’ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఆ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలని దర్శకుడు తేజ భావించారట. సాయి పల్లవి కలిసి అడిగారట కూడా. అయితే సాయి పల్లవి మాత్రం నిర్మోహమాటంగా నో చెప్పినట్టు తెలుస్తోంది.

దర్శకుడు తేజ అంటేనే హీరోయిన్స్ జంకుతారు. ఆయన హీరోయిన్స్ ని తిడతారు. అవసరమైతే కొడతారు అనే ప్రచారం ఉంది. ఇదీగాక వరుణ్ తేజ్, నాగ చైతన్య, నాని, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలతో జతకడుతున్న సాయిపల్లవికి శర్వానంద్ ముదురు హీరో అనిపించు ఉంటారని చెబుతున్నారు. సాయి పల్లవి నో చెప్పడంతో.. మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టాడత తేజ. ‘నేను రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన తేజ ‘సీత’తో మరో ప్లాపు మూటగట్టుకున్నారు.