భారత్’కు విజయ్ మాల్యా.. సస్పెన్స్ !
భారత్‌లో వివిధ బ్యాంకుల్లో రూ.9000 కోట్ల రుణాలు ఎగొట్టి.. లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా కథ క్లైమాక్స్ కి చేరింది. గురువారమే విజయ్ మాల్యా భారత్ చేరుకుంటారని.. వచ్చి రాగానే ఆయన్ని ముంబై జైల్లో పెడతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తెలిసింది. మాల్యాని లండన్ ప్రభుత్వం భారత్ కి అప్పగించనుంది. అయితే అది ఎప్పుడు అన్న సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు.
“విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ లండన్ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బ్రిటిష్ సర్వోన్నత న్యాయస్థానాన్ని మాల్యా ఆశ్రయించాడు. గత నెలలో దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించాల్సి ఉంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించాలంటే మాత్రం అతనిపై ఉన్న ఇతర చట్ట పరమైన అంశాలన్నీ పరిష్కారం కావాల్సి ఉంది. అప్పటిదాకా మాల్యా బ్రిటన్ విడిచి వెళ్లడానికి కుదరదు” అంటూ బ్రిటిష్ హై కమీషన్ అధికారి ప్రతినిధి వెల్లడించారు.