అందమైన అమ్మడికి ఈ పాడు అలవాటు ఏమిటో ?

టాలీవుడ్ లో ఓ హీరోయిన్ వింత అలవాటు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెబుతూ ఉంటుందట. పాపులర్ హీరోయిన్ కాబట్టి హీరోలు కాస్త చనువుగా మాట్లాడేస్తుంటారు. ఈ మాట్లాడేటప్పుడే ఆ హీరో ఇలా అన్నాడు, ఇలా గోకే ప్రయత్నం చేశాడని బయట చెబుతుందట. ఈ అలవాటు వల్ల ఒకటి రెండు సార్లు హీరోలకు హీరోలకు మధ్య మనస్పర్ధలు ఏర్పడే ప్రమాదం ఏర్పడిందని సమాచారమ్. ఈ హీరోయిన్ నైజం తెలిసి.. ఆమె పట్ల జాగ్రత్తగా వ్యవహించాలని హీరోలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఆకట్టుకొనే అందం. మంచి సినిమాలు చేసింది. మంచి నటి అనిపించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ అనిపించుకుంది. పెద్దగా ఎఫైర్స్ ల్లేవ్. అయినా.. ఈ అందమైన అమ్మడుకు ఈ పాటు అలవాటు ఏంటో.. ? అర్థం కావడం లేదు. అన్నట్టు గత యేడాది ఈ హీరోయిన్ ఖాతాలో ఓ ఫ్యామిలీ హిట్ పడింది. ప్రస్తుతం చేతిలో ఒకట్రెండు సినిమాలున్నాయ్. అయితే.. ఆ అమ్మడు ఎవరు ? అన్నది ఎవరు నోరు తెరచి చెప్పడం లేదు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటారు !?