తమ్మూ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?


హీరోయిన్-హీరోయిన్ ప్రేమలో పడితే గమ్మత్తుగా ఉంటుంది కదూ.. ! ఛార్మీ-త్రిష నిజంగానే ప్రేమలో పడ్డారు. వీరిద్దరు బెస్ట్ ప్రెండ్. కాదు లవ్వర్స్. త్రిష ఒప్పుకుంటే.. ఆమెని పెళ్లి చేసుకుంటానని ఛార్మి అప్పట్లో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకు త్రిష కూడా దాదాపు ఓకే అనేసింది. ఇలాంటి జంటే మరోటి కూడా ఉంది. వారే తమన్నా-శృతిహాసన్.

మిల్కీ బ్యూటీ తమన్నాకి శృతి బెస్ట్ ఫ్రెండ్ అంట. ముంబైలో ఉండే సమయంలో మా ఇంటి దగ్గరల్లోనే శృతి హాసన్ ఇళ్లు ఉండేది. మేం తరచు కలుసుకునేవాళ్లం. క‌లుసుకున్న‌ప్పుడ‌ల్లా త‌మ జీవితాల గురించి మాట్లాడుకునేవాళ్ల‌మ‌న్నారు. ముఖ్యంగా శ్రుతికి నెగిటివిటీ అంటే అస‌లు ఇష్టం ఉండ‌ద‌న్నారు. శ్రుతిలోని ఆ గొప్ప గుణ‌మే తామిద్ద‌రూ మంచి స్నేహితులు కావ‌డానికి కార‌ణ‌మైంద‌ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ్మూ చెప్పుకొచ్చింది.

ప్రేమ వ్యవహారాల్లో పడి గత కొంతకాలంగా దూరంగా ఉన్నా శృతిహాసన్.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తోంది. బలుపు కాంబోలో వస్తున్న సినిమా ఇది. గోపీచంద్ మలినేని దర్శకుడు. రవితేజ-శృతిహాసన్ జంటగానటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కోసం శృతినితీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.