దేశంలో 9851 కొత్త కేసులు
భారత్లో కరోనా వైరస్ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కరోనా బారినపడ్డ వారిసంఖ్య 2,26,770కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.
మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశంలో అత్యధికంగా 273మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 6348కి చేరింది. దేశంలో కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకోగా మరో 1,10,960 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 7స్థానంలో ఉంది.