తిరుమల భక్తులకి గైడ్ లైన్స్.. ఇవే !
కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదల్లేదు. కరోనా లాక్డౌన్ తో దేవాలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఐదో విడత లాక్డౌన్ లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఈ నెల 8 నుంచి తిరిగి దేవాలయాలు తెరచుకోనున్నాయి. తిరుమల తిరుపతి దేవాస్థానం కూడా తెరచుకోనుంది. ఈ నేపథ్యంలో తిరుమల భక్తులకి గైడ్ లైన్స్ గురించి వివరించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్ది.
తిరుమల భక్తుల గైడ్ లైన్స్ :
* ఈ నెల 8 నుంచి తిరుమల దేవాస్థానం తెరచుకోనుంది.
* ఈ నెల 8, 9 తేదీల్లో కేవలం టీటీడీ ఉద్యోగులకి మాత్రమే దర్శనం కల్పించనున్నారు
* 10 న స్థానికులకి దర్శనం కల్పిస్తారు
* 11 నుంచి సామాన్య భక్తులకి అవకాశం ఇవ్వనున్నారు
* 65 యేళ్లు పైబడిన వారు. 10యేళ్ల లోపు పిల్లలు శ్రీవారి దర్శనానికి రావొద్దు
* శ్రీవారి దర్శనం ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు మాత్రమే కల్పిస్తారు
* ప్రతిరోజూ 3వేల మందికి మాత్రమే దర్శనం
* కంటైన్మెంట్ జోన్ల నుంచి ఎవరు శ్రీవారి దర్శనానికి రావొద్దు * మాస్క్, వ్యక్తిగ దూరం తప్పనిసరి
* అలిపిరి ద్వారా మాత్రమే కాలినడకన అనుమతిని ఇస్తారు.