ఐఏఎస్ బ‌దిలీలు అందుకేనా…!!

తెలంగాణ‌లో భారీగా ఐఏఎస్ ల బ‌దిలీలు జ‌రిగాయి. మొత్తం 29మంది ఐఏఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో విభేదించి , సొంత మార్క్ తో ముందుకెళుతున్న కొంద‌రు క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి భూక‌బ్జాను వెలుగులోకి తీసుకువ‌చ్చిన క‌లెక్ట‌ర్ శ్రీ‌దేవ‌సేన‌ను , మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే నాయ‌క్ తో వివాదం ఉన్న ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రీతీమీనా ను బ‌దిలీ చేయ‌డం , ఇలా ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో వివాదాస్ప‌దంగా ఉంటూ, అధికార పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం కోసమే భారీగా ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించే ఎమ్మెల్యేల‌కు గట్టి వార్నింగ్ ఇచ్చినా అధికారుల‌కు వారికి మ‌ధ్య ఉన్న వివాదం జ‌నంలో నుంచి తీసేయ‌డం అంత ఈజీ కాద‌ని అధికార పార్టీ భావించింద‌ట‌. జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్ తో పాటు మెద‌క్, భూపాల‌ప‌ల్లి క‌లెక్ట‌ర్ల‌ను కూడా బదిలీ చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు ప‌లువురు.

అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. 
– రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా
– ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా
– రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి
– వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు
– పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్
– బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు
– కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా నవీన్ మిత్తల్
– విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్
– పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా
– బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్ర
– మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు
– గిరిజిన సంక్షేమ కమిషనర్‌గా క్రిస్టినా
– ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్దప్రకాశ్
– భూ పరిపాలన సంచాలకులుగా వాకాటీ కరుణ
– రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి
– సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్
– ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులుగా ప్రీతిమీనా
– వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఒమర్ జలీల్
– నిజామాబాద్ కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు
– పెద్దపల్లి కలెక్టర్‌గా దేవసేన
– జనగాం కలెక్టర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు
– మెదక్ కలెక్టర్‌గా మాణిక్‌రాజుకు అదనపు బాధ్యతలు
– మహబూబాబాద్ కలెక్టర్‌గా లోకేశ్ కుమార్‌కు అదనపు బాధ్యతులు
– ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు
– ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అశోక్‌కుమార్
– ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్‌డీగా కాళీచరణ్
– జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా భారతి హోళికేరి
– జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా సిక్బా పట్నాయక్
– జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ముషారఫ్ అలీ
– బోధన్ సంయుక్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
– మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్
– భద్రాచలం సంయుక్త కలెక్టర్‌గా పమేలా సత్పతి
– బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్