కరెంట్ బిల్లులు కంటమంటే తరిమికొట్టారు

కరోనా లాక్‌డౌన్ తో రెండు నెలలు కరెంట్ బిల్లులు వసూలు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. అయితే మూడు నెలలకి కలిపి ఒకేసారి బిల్లులు పంపించింది. వాటిని ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. అయితే గతంలో వందల్లో వచ్చే కరెంట్ బిల్లులు ఇప్పుడు వేలల్లో రావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యతోనే శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో కరెంట్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. కరెంట్ బిల్లులు కట్టమని తేల్చి చెప్పారు.

అసలే కరోనా, లాక్‌డౌన్ తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. ఇలాంటి సమయాల్లో గతంలో వందల్లో వచ్చే బిల్లులు ఇప్పుడు వేలల్లో రావడంపై ఆందోళ వ్యక్తం చేశారు. తమ పరిస్థితి అర్థం చేసుకోవాలి. కరెంట్ బిల్లుల జారీ విషయంలో తప్పులు జరిగాయి అంటున్నారు. ఈ సమస్య ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు. దేశం మొత్తం ఉంది. తమిళ్ నాడులో సీనియర్ హీరోయిన్ స్నేహ భర్త నడుటు ప్రసన్న కుమార్ కరెంట్ బిల్లు ఏకంగా 42వేలు వచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.