అందుకే కరోనా కేసులు పెరిగాయ్ : ఈటెల

గత కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతిరోజూ వందకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కరోనా నిర్థారణ పరీక్షలు ఎక్కువగా చేయడం లేదు. సరిగ్గా వసతులు కల్పించడం లేదనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.  తాజాగా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా ముందుకొచ్చారు. కరోనా కేసులు, వసతులపై వివరణ ఇచ్చే ప్రయత్న చేశారు.

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగాయ్. ముంబై, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, వలస కూలీలతో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి సూచించారు. సోషల్ మీడియా వేదికగా కరోనాపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. కరోనా కేసుల పెరుగుదలపై రెండ్రోజులుగా చర్చించారు. కరోనా తగ్గుదలకి అన్నీ రకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.