పది పరీక్షలు వాయిదా. రద్దు కూడా ?

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జీహెచ్ ఎంసీ మినహా మిగతా చోట్ల పది పరీక్షలు నిర్వహించేందుకు శనివారం హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు తీర్పుపై సమాలోచనలు చేసిన ప్రభుత్వం.. పది పరీక్షలని వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక్కో చోట ఒక్కోసారి పరీక్షలు నిర్వహిస్తే ఉపయోగం ఉండని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది.

పది పరీక్షలపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పది పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ తరహా విద్యార్థులకి గ్రేడ్స్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా చేసుకొని వీటిని ఇవ్వనున్నారు.

హైకోర్ట్ ఆదేశించినట్టు జీహెచ్ ఎంసీ మినహా మిగితా చోట్ల పరీక్షలు నిర్వహించిన ఉపయోగం ఉండదు. బాసర, ఆర్ జీయూకేటీ, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలని నిర్వహించడం సాధ్యం కాదు. ఇదీగాక సప్లమెంటరీ పరీక్షల్లో తప్పిన జీహెచ్ ఎంసీ విద్యార్థులకి మరోసారి పరీక్షలు నిర్వహించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే పది పరీక్షల వాయిదా.. మొత్తానికే రద్దు దిశగా తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. రేపు దీనిపై తేలనుంది.