రజనీ, కమల్ రాజకీయాలపై ఖుష్బూ కామెంట్స్

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఆమె తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళానేతగా కొనసాగుతున్నారు. తాజాగా తన సహ నటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ రాజకీయ ప్రవేశం గురించి మీడియాతో ముచ్చటించారు. రజనీకాంత్‌ ‘కింగ్‌’లా ఉండాలని.. ‘కింగ్‌ మేకర్‌’ కాకూడదన్నారు.

‘ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం రజనీకాంత్‌ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మాకు ఇప్పటికీ తెలియదు. గత లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ బాగా రాణించారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తు తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఎన్నికలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. రజనీ త్వరలోనే తన పార్టీని ప్రారంభిస్తారని ఆశిస్తున్నా’నని ఖుష్భూ అన్నారు.