గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు షాక్..
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన సింగర్ గజల్ శ్రీనివాస్ ను నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. అయితే అతని బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గజల్ శ్రీనివాస్ ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు అనుమతి కోరాఉఉ. కోర్టు అనుమతివ్వడంతో పోలీసులు ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు.
ఏ1గా గజల్ శ్రీనివాస్ ను, ఏ2గా పార్వతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితురాలు పార్వతిని ఇవాళ పోలీసులు అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.