ముద్దుగుమ్మలు బయటికొచ్చారు


కరోనా లాక్‌డౌన్‌ సినీ తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో నచ్చిన పనులు చేసుకున్నారు. కొత్త పనులు నేర్చుకున్నారు. వాటికి సంబధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులని ఖుషి చేశారు. అయితే లాక్‌డౌన్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తుండటంతో సెలబ్రిటీలు బయటికొస్తున్నారు. తాజాగా అందాల భామలు రకుల్‌ప్రీత్‌సింగ్‌, దిశాపటానీ ముంబై వీధుల్లో కనిపించారు. బ్లాక్‌ కాస్ట్యూమ్స్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్‌ నడుచుకుంటూ వెళ్తున్నపుడు తీసిన ఓ వీడియోతోపాటు  దిశాపటానీ వెళ్తున్న స్టిల్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలుగులో స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ పై పోకస్ పెట్టింది. టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లని కూడా వదలడం లేదు. కాకపోతే గతంలో మాదిరిగా ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు రావడం లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లోనూ రకుల్ నటిస్తోంది. ప్రస్తుతం ఆమె భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. క దిశాపటానీ తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన ఫేసు. ఆమె ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ధోని బయోపిక్ తో రెండోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. బన్నీ-సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో దిశా ఐటమ్ సాంగ్ లో చిందేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.