మోక్షజ్ఝ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు : బాలయ్య

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఝ ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాల్సివుంది. అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 2015 నుంచి మోక్షజ్ఝ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మోక్షజ్ఝ ఎంట్రీ ఉంటుందని బాలయ్య ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు మోక్షజ్ఝ రంగంలోకి దిగింది లేదు. తొడగొట్టింది లేదు.

60వ పుట్టినరోజుని జరుపుకుంటున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఝ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాది మోక్షజ్ఝ ఎంట్రీ ఉండదు. వచ్చే యేడాది కూడా ఉండదని చెప్పారు. మొత్తానికి ఇప్పట్లో మోక్షజ్ఝ ఎంట్రీ ఉండదని క్లారిటీ ఇచ్చారు బాలయ్య. ఎందుకు ? అంటే తాను దైవానుగ్రహాన్ని నమ్ముతాను. ఇప్పట్లో మోక్షజ్ఝ జాతకం బాగులేదు అన్నట్టుగా బాలయ్య చెప్పుకొచ్చారు.