సినిమా షూటింగ్స్.. పాటించాల్సిన గైడ్ లైన్స్ ఇవే !

రెండు తెలుగు రాష్ట్రాలు సినిమా షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా, టీవీ సీరియల్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల కోసం అనుమతులు ఇచ్చాయి. తాజాగా సినిమా షూటింగ్స్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 22 అంశాలతో గైడ్స్ లైన్స్ ని రెడీ చేశారు. వీటిని తూ.చ తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.

ఆ 22 గైడ్ లైన్స్ ఇవే :

*  షూటింగ్ కు ముందు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షంచాలి. భౌతికదూరం పాటించాలి

* పని ప్రదేశాలైన నిర్మాణ కార్యాలయాలు, స్టూడియోలు, షూటింగ్ లొకేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి

* సిబ్బంది వినియోగించే వాహనాలు, సినిమా చిత్రీకరణకు సంబంధించిన వస్తువులను శానిటైజ్ చేశాకే వాడుకోవాలి

* షూటింగ్ సమయంలో  40 మంది మాత్రమే ఉండేలా దర్శక-నిర్మాతలు చూసుకోవాలి

* వీలైనంత వరకు ఇండోర్ షూటింగులకే ప్రాధాన్యత ఇవ్వాలి

*  భోజన విరామ సమయంలో భౌతిక దూరం పాటించాలని, సామూహిక భోజనాలు రద్దు చేసుకోవాలి

* పని ప్రదేశాల్లో పోగాకు, గుట్కాను పూర్తిగా నిషేధం

* సినిమాతో సంబంధం లేని వ్యక్తులెవరిని లొకేషన్ లోకి అనుమతించరాదు

* నటీనటులకు సంబంధించి మెడికల్ క్లియరెన్స్ ఉంటేనే 10 ఏళ్లలోపు పిల్లలను 60 ఏళ్లుపైబడిన వృద్ధులను అనుమతించాలి

* నటీనటుల ఎంపిక కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసుకోవాలి

* నటీనటులు మేకప్ మ్యాన్లు ఎక్కువ మంది లేకుండా చూసుకోవాలి. వ్యక్తిగత మేకప్ కిట్లు కొనసాగించాలి.

* మేకప్ సిబ్బంది తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించి ఉండాలి

* నటీనటులు ధరించే వస్త్రాలకు వారి పేర్లతో భద్రపర్చాలని, ఎప్పటికప్పుడు వాటిని శానిటైజ్ చేయాలి

* యూనిట్ లో ఎవరికైనా జలుబు, జ్వరంగా ఉంటే వెంటనే 108 లేదా 104కు సమాచారం అందించాలి

* ఇదివరకే ఎవరైనా కొవిడ్- 19 బారినపడి కోలుకొని ఉంటే వారి నుంచి తప్పనిసరిగా డిక్లరేషన్ తీసుకొవాలి.

* పని ప్రదేశాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిర్మాతలు, దర్శకులు చూసుకోవాలి

*  కొవిడ్-19 సూచనలను లొకేషన్లలో తెలుగు, ఆంగ్లంలో రాసిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి

* చిత్రీకరణలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఫోటో ఐడెంటీ కార్డులు ఇవ్వాలి.

* ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, సీజీ, పోస్ట్ ప్రొడక్షన్, కథా చర్చల్లో పరిమిత సంఖ్యలోనే జనాలు ఉండేలా చూసుకోవాలి

*  కంటైన్మెంట్ జోన్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా షూటింగులకు అనుమతించేది లేదు

*  రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు థియేటర్ల మూసివేత కొనసాగుతుందని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.