నన్ను చాలామంది పడకగదిలోకి పిలిచారు
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది ఓపెన్ అయ్యారు. తమకు ఎదురైన పడకగది పిలుపులని పంచుకున్నారు. ఈ జాబితాలో యంగ్ హీరోయిన్స్ నుంచి స్టార్ హీరోయిన్స్, సీనియర్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. తనకి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయి. చాలామంది తనని బెడ్ రూమ్ లోకి పిలిచారు. దాని వలన ప్రేమించినవాడు కూడా దూరమయ్యాడని చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో 90శాతం కాస్టింగ్ కౌచ్ ఉంది. ఆ చెత్త దాటి వెళ్లిన తర్వాతే అసలైన ఇండస్ట్రీ మనుషులుంటారు, అసలైన గుర్తింపు కూడా వస్తుంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను. నన్ను కమిట్ మెంట్ అడిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. బాంబే హీరోయిన్లను ఎందుకు తెచ్చుకుంటారంటే వాళ్లకు తెలుసు పడక పంచుకోవాలని. 90 శాతం ముంబయి అమ్మాయిలు మెంటల్లీ ప్రిపేర్ అయి వస్తారుని తెలిపింది.