హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
కన్నడ హీరోయిన్ మయూరి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. మయూరి, తన స్నేహితుడు అర్జున్ ని పెళ్లాడింది. బెంగళూరులోని శ్రీతిరుమలగిరి శ్రీలక్ష్మివెంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో వివాహం జరిగింది. మయూరి పెళ్లి విషయం ఏ మాత్రం బయటకు రాలేదు. మయూరి.. తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసేవరకు ఆమె పెళ్లి గురించి ఎవ్వరికీ తెలీదు. అంత గోప్యంగా ఆమె పెళ్లి చేసుకున్నారు.
‘అవును నేను, ఆరుణ్ ఈ రోజు ఉదయం వివాహం చేసుకున్నాం. పదేళ్ల స్నేహానికి ఈరోజు అర్థవంతమైన ముగింపు లభిం చింది. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో చెబుతాను’ అని మయూరి ఇన్‌స్టాలో పేర్కొన్నారు. నక్షత్ర అనే టీవీ సీరియల్‌తో నటిగా అరంగేట్రం చేసిన మయూరి 2015లో కృష్ణ లీలా అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో ఆమె నటించారు. మంచి నటి అనిపించుకున్నారు.