ఆ చిన్నారి డ్యాన్స్ కి హృతిక్ ఫిదా

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ టాలెంట్ గురించి తెలిసిందే. ఆయన స్టెప్పేస్తే ఫోర్ దద్దరిల్లాల్సిందే. అలాంటి హృతిక్ ఓ చిన్నారి డ్యాన్స్ కి ఫిదా అయిపోయాడు. ఆ చిన్నారి డ్యాన్స్ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. గీత్‌ అనే బాలిక హృతిక్‌ నటించిన ‘వార్‌’ సినిమాలోని ‘జై జై శివ్‌ శంకర్‌..’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీన్ని అభిమానుల ఖాతా ద్వారా చూసిన హృతిక్‌ స్పందించారు. పాప డ్యాన్స్‌ వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ‘వాట్‌ ఎ స్టార్‌.. లవ్‌యు’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం గీత్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.