అచ్చెన్నాయుడికి 14రోజుల రిమాండ్

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడుకి విజయవాడ అనిశా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించింది. అచ్చెన్నాయుడుకి అనారోగ్యం దృష్ట్యా.. ఆయనకి వైద్యం అందించాలని కోర్టు సూచిందింది. ఈ నేపథ్యంలో ఆయనకి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేశ్‌కుమార్‌ను రాజమండ్రి సబ్‌జైలుకు తరలించారు.

శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామమైన నిమ్మాడలో అదుపులోని తీసుకున్నారు. అత్యంత సీక్రెట్ గా ఆయన్ని అరెస్ట్ చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆయన్ని అరెస్ట్ చేసి ఊరు దాటించారు. ఈ అరెస్టు వ్యవహారం శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన రూ. 150కోట్ల అవినీతి జరిగింది. ఇందులో అప్పటి మంత్రి అచెన్నాయుడు పాత్ర ఉందని తేలింది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.