వందేళ్ల క్రికెటర్ కన్నుమూత

మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ వసంత్‌ రాయిజి(100) కన్నుమూశారు. దక్షిణ ముంబయిలోని తన నివాసంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.  కుడిచేతి బ్యాట్స్‌మన్‌ అయిన ఈ మాజీ క్రికెటర్‌ 1940ల్లో తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. మొత్తం 277 పరుగులు చేయగా, 68 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేశారు.

ఇక దక్షిణ బాంబేలోని జింఖానా మైదానంలో టీమ్‌ఇండియా తొలి టెస్టు ఆడినప్పుడు రాయిజీ వయసు 13 ఏళ్లు. దీంతో అతను జీవితకాలంలో మొత్తం టీమ్‌ఇండియా ప్రాయాణాన్ని చూశారు. 1939లో క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వసంత్‌ రాయిజీ సెంట్రల్‌ ప్రావిన్సెస్‌, బెరార్‌ జట్లపై ఆడారు. పలువురి క్రికెటర్ల మీదా వసంత్ పుస్తకాలు రాశారు.