మేడారం జాతరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య..!
తెలంగాణలో జరిగే సమ్మక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కోరారు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి సమ్మక్క జాతరకు హాజరుకావాలని కోరారు మంత్రి. సమ్మక్క సారక్క జాతరకు తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
జనవరి 30 నుండి నాలుగు రోజులు జరిగే జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి. ఈ ఏడాది జరుగుతున్న జాతరకు 80 కోట్ల రూపాయలు కేటాయించామని, ఈసారి జాతరకు కోటి మంది భక్తులు వివిధ రాష్ట్రాలనుండి వస్తారని అంచనా వేస్తున్నామన్నారాయన. జాతరకు హాజరయ్యే మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.