‘కేజీఎఫ్ 2’ ఓటీటీ రిలీజ్ పై యశ్ స్పందన

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యశ్ నటించిన చిత్రం ‘కేజీఎఫ్’ ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 ని మించేలా సీక్వెల్ ని తీర్చిదిద్దితున్నారు. పలువు బాలీవుడ్ నటీనటులు కేజీఎఫ్ 2లో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం 20 శాతం మాత్రమే మిగిలివుంది. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ ప్రారంభించనున్నారు. అయితే కేజీఎఫ్ 2 నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ ప్రచారంపై యశ్ స్పందించారు.  “కేజీఎఫ్‌ 2’ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు. అసలు ఆ ప్రశ్నకు చోటేలేదు. బిగ్‌స్క్రీన్‌పై కనువిందు చేసేలా సినిమాను రూపొందిస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలు నాకు, నా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కు తెలుసు. మొదటి పార్ట్‌కంటే రెండో పార్ట్‌ ఇంకా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని, అలరించాలని అభిమానులు అనుకుంటున్నారు. వారిని నిరాశకు గురి చేయడం నాకిష్టం లేదు, ఎప్పటికీ అలా చేయను’ అని యశ్‌ తెలిపారు.