సూర్య లుక్’పై ఎన్టీఆర్ ప్రశంసలు

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సూర్య పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వక్కంత వంశీ దర్శకత్వంలో బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావొస్తోంది. ఏప్రిల్ 27న సూర్యని తెరపై చూడబోతున్నాం. ఇక, ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ ఇంపాక్ట్ ని రిలీజ్ చేశారు.
ఇది యంగ్ టైగర్’కు బాగా నచ్చేసింది. వెంటనే దర్శకుడు వక్కంతం వంశీకి మెసేజ్ పెట్టాడట.

” ‘నా పేరు సూర్య’ ఫస్టు ఇంపాక్ట్ చాలా బాగుంది. బన్నీ బాగా చేశాడు ” అంటూ కితాబిచ్చాడట తారక్. తారక్ మెసేజ్ గురించి వక్కంతం వంశీ సన్నిహితులతో షేర్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఎన్టీఆర్ సినిమాతోనే వంశీ దర్శకుడిగా ఎంట్రీ ఇవాల్సి ఉంది. తారక్ కోసం ఓ కథని రెడీ చేసుకొని.. చాన్నాళ్ల పాటు వెయిట్ చేశాడు కూడా. ఐతే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత వంశీ చెప్పిన కథని బన్నీ ఓకే చేయడం.. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది. ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి సినిమాలు వక్కంతం వంశీ అందించిన కథతో తెరకెక్కినవే. భవిష్యత్ లో వంశీ దర్శకత్వంలో తారక్ సినిమా తప్పక ఉంటుందని చెప్పుకొంటున్నారు.