గవర్నర్’కు అస్వస్థత
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం తోపాటు యూరాలజీకి సంబంధించిన సమస్యలతో మొదంత హాస్పటల్ లో చేరారు. అయితే ప్రస్తుతం టాండన్ ఆరోగ్య నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు ఆదివారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
మరోవైపు గవర్నర్ ఆసుపత్రిలో చేరారని తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. దేశంలో కరోనా ఫీవర్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేష్ గవర్నర్ కూడా కరోనా బారినపడ్డారా ? అనే అనుమానాలు కలిగాయి. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది.