కరోనా ఎఫెక్ట్ : కేబినేట్ నుంచి ఈటెల అవుట్ ?
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 200కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజూకి మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ప్రభావం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై పడనుంది. ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేయనున్నారనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.
గతంలో సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పడు కూడా ఈటెల మంత్రి పదవి ఊడనుందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఈటెల గట్టిగానే స్పందించారు. గులాబి జెండాకు అసలైన ఓనర్లమన్నారు. ఆ తర్వాత అంతా సర్థుకుంది. ఈటెలని మంత్రిగా కొనసాగించారు.
అయితే ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ని ఈటెల పై మోపి.. ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేస్తారని రేవంత్ ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణలన్నీ నిజం అవుతాయని కాదు. కానీ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాజకీయాలని హీటెక్కించేలా ఉన్నాయి.