ప్రశ్నించే వారిని భయపెట్టే ప్రయత్నమే ఇదీ.. !

ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయనకి విజయవాడ ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ ని విధించింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని కలవడానికి తెదేపా అధినేత చంద్రబాబుకి అనుమతి లభించలేదు.

అయితే అచ్చెన్నాయుడు అన్న కొడుకు, ఎంపీ రామ్మోహన్నాయుడికి ఆ అవకాశం కలిశారు. ఆసుపత్రిలో బాబాయ్ ని పరామర్శించిన తర్వాత రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. బాబాయ్ ని టెర్రరిస్టు లాగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సర్జరీ అయిందని అన్నీ రకాలుగా సహకరిస్తానని చెప్పినా రాక్షసత్వంగా వ్యవహరించారని, సర్జరీ అయిందని తెలిసి కూడా ఆయనను చాలా దూరం ప్రయాణం చేయించారని అన్నారు.

అచ్చెన్నాయుడు బలమైన వాయిస్ వినిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన్ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ లో ప్రశ్నించడాన్ని సహించ లేక అయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. అయితే బెదిరింపులకి భయపడేది లేదు. దైర్యంగా ఎదుర్కొంటామన్నారు.