సుశాంత్ మృతిపై ప్రధాని సంతాపం
బాలీవుడ్ లో విషాదం నెలకొంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతిని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతుంది. సుశాంత్ మృతిపై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా సుశాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
“అద్భుతమైన యువ నటుడు సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టెలివిజన్, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. వినోద ప్రపంచంలో ఆయన ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. మరిచిపోలేని చక్కని ప్రదర్శనలను మనకు విడిచి ఆయన వెళ్లిపోయారు. ఆయన చనిపోయారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి” అని ప్రధాని ట్విట్ చేశారు.
Sushant Singh Rajput…a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 14, 2020