తొమ్మిదో రోజూ పెరిగిన పెట్రో ధరలు
దేశంలో పెట్రో ధరలు నాన్ స్టాప్ గా పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా తొమ్మిదో రోజూ పెంచాయి. మొత్తంగా గత తొమ్మిది రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.5.. లీటరు డీజిల్‌పై రూ.5.23 పెరిగింది.
సోమవారం ఢిల్లీలో పెట్రోల్‌పై 48 పైసలు పెరిగి రూ.రూ.76.26 కాగా, డీజిల్‌పై 59 పైసలు పెంపుతో రూ.74.62గా నమోదైంది.
ముంబయిలో లీటరు పెట్రోల్ రూ.82.70.. లీటరు డీజిల్ ధర రూ.73.21, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.79.53.. లీటరు డీజిల్ ధర రూ.72.69గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.77.64కాగా, లీటరు డీజిల్ ధర రూ.70.33గా నమోదైంది.