బిగ్ ట్విస్ట్ : సుశాంత్ ని హత్య చేశారు ?


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం జ్యూస్‌ తాగి బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్న సుశాంత్‌.. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు తలుపు పగలగొట్టి చూడగా, బెడ్‌షీట్‌ సాయంతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సుశాంత్‌ కనిపించాడు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు, 108కి కాల్‌ చేసి చెప్పారు. అప్పటికే సుశాంత్‌ మృతిచెందాడు.

ఆత్మహత్యకు ముందు సుశాంత్ తన సోదరితో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆ రోజు కొంతమంది స్నేహితులు.. సుశాంత్ నివాసంలో ఉన్నట్లు చెబుతున్నారు. వారెవరు ? అసలు ఏం జరిగింది ?? తెలుసుకొనే పనిలో పోలీసులు ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత 6 నెలలుగా డిప్రెషన్‌లో ఉంటూ, చికిత్స పొందుతున్నారని పోలీసులు చెబుతున్నారు. డిప్రెషన్ లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు.

అయితే సుశాంత్ బంధువులు మాత్రం ఇది ఆత్మహత్య కాదు. కచ్చితంగా హత్యే అంటున్నారు. మీడియాతో మాట్లాడిన సుశాంత్ మామ.. అతడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతి వెనుక ఏదో కుట్ర ఉండవచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేసారు.. సుశాంత్‌ది ముమ్మాటికి హత్యే అయి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన కోరారు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కొత్త టర్న్ తీసుకోనేలా కనిపిస్తోంది. సుశాంత్ మామ ఆరోపిస్తున్నట్టు నిజంగానే సుశాంత్ హత్య కాబడ్డాడా ? అనేది పోలీసుల విచారణలో తేలనుంది.