లాక్డౌన్ వేళ.. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం !
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజలంతా కరోనా ఫీవర్ లోనే ఉన్నారు. ఇలాంటి టైంని బిజినెస్ కు అనుకూలంగా మార్చుకుంది వ్యభిచార ముఠా. ముంబై నుంచి యువతులని తీసుకొచ్చి వ్యభిచారం చేయించి సొమ్ము చేసుకుంటోంది. ఇలాంటి ఓ ముఠాను మైలార్దేవుపల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అబ్దుల్ మిస్కిన్(30) దంపతులు సంపాదన కోసం అడ్డదారి ఎంచుకున్నారు. షేక్ ముస్తాక్(27) అనే ఆటో డ్రైవర్‌తో కలిసి ముంబయి నుంచి ఇద్దరు యువతులను రప్పించారు. పాతబస్తీ, రాజేంద్రనగర్ సర్కిల్ ప్రాంతాల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. విటులు ఫోన్‌చేస్తే ఆటోలో షేక్ ముష్తాక్ ఆ యువతులను వారింటికి తీసుకువెళ్తాడు.
మూడు రోజుల క్రితం శాస్త్రిపురం డివిజన్లోని కింగ్స్‌కాలనీలో ఈ ముఠా మకాం ఏర్పాటు చేసుకుంది. విటులు వస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి దాడులు చేసి నిర్వాహకులతో పాటు నగరానికి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి, ఇద్దరు యువతులను సంరక్షణ గృహానికి తరలించారు.