కరోనా ఫుల్ తెలంగాణ
ఢిల్లీ మర్కర్ ఘటనకి ముందు తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టే అనిపించింది. మరికొద్ది రోజుల్లో కరోనా ఫ్రీ తెలంగాణాని చూడబోతున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ నే అన్నారు. కానీ ఢిల్లీ మర్కజ్ ఘటనతో తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయ్. ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఇంకా ఎక్కువవుతోంది. ఇంకా చెప్పాలంటే కరోనా ఫుల్ తెలంగాణ అవుతోంది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 237 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 4,974కు చేరింది. ఇవాళ కొవిడ్ బారినపడి ముగ్గురు బాధితులు మరణించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 185 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 2,377 మంది డిశ్చార్జ్ కాగా.. 2,412 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎసీలోనే అత్యధికంగా 195 కేసులు నమోదవుతున్నాయి.