సడెన్ షాక్ ఇచ్చిన త్రిష


ముద్దుగుమ్మ త్రిష అభిమానులకి సడెన్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. అది శాశ్వతంగా కాదు. బ్రేక్ మాత్రమేనని తెలిపింది. సోషల్ మీడియా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వస్తుందనే విషయాన్ని లాస్ట్ ట్విట్ ద్వారా అభిమానులకి తెలియజేసింది.  

‘ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఏం జరుగుతోందో నాకు తెలియకుండా ఉండటం అవసరం.. మైండ్‌కు ఇది డిజిటల్‌ చికిత్స లాంటిది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లవ్‌ యూ గాయ్స్‌.. త్వరలోనే కలుద్దాం..’ అని త్రిష ట్వీట్‌ చేశారు. ఇదే పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్‌ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ వయసులోనూ త్రిష యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు.

 గత ఏడాది ‘పేటా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఇటీవల శింబుతో కలిసి లఘు చిత్రంలో కనిపించారు. దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దీన్ని తెరకెక్కించారు. మే 20న విడుదలైన లఘు చిత్రాన్ని యూట్యూబ్‌లో 73 లక్షల మందికిపైగా వీక్షించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ దీనికి నేపథ్య సంగీతం అందించారు. ఇది కాకుండా త్రిష చేతిలో దాదాపు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ ప్రొడక్షన్‌ పరంగా వివిధ దశల్లో ఉన్నాయి. మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో త్రిష ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకున్నా.. ఆమెకు లూసిఫర్ రిమేక్ లో ఛాన్స్ వచ్చినట్టు సమాచారమ్.